ప్రముఖ యూట్యూబరే మృతి చెందింది..
పాలేరు చెరువులోకి దూసుకెళ్లిన కారులో వ్యక్తి గుర్తింపు.
కాకతీయ , కూసుమంచి : కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో శనివారం ఉదయం చెరువులోకి దూసుకెళ్లి కారు ప్రమాదంలో చనిపోయిన ఘటనలోని వ్యక్తినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ గా గుర్తించారు. ఈయన గతంలో పవన్ కళ్యాణ్ హటావో పాలిటిక్స్ బచావో అనే పుస్తకం రాశాడు.. ఈ పుస్తక వివాదానికి కారణం అయి జైలు పాలు అయ్యాడు.. ఆయనే శనివారం ఉదయం పాలేరు చెరువులోకి దూసుకెళ్లిన కారు ప్రమాదంలో మృతి చెందినట్టు గుర్తించారు.. అయితే కారు వేగంగా దూసుకెళ్లడం వల్ల ప్రమాదం జరిగిందా లేదా అనేది మిస్టరీగా ఉంది..కారు వెనక సీట్లో కూర్చున్న వ్యక్తి బొగ్గుల శ్రీనివాస్ మృతి చెందగా ,డ్రైవర్ మాత్రం పరారీలో ఉన్నాడు. దీంతో కారు ప్రమాద ఘటన పై పలు అనుమానాలు కలుగుతున్నాయి..


