కల్లూరులో పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఇంటింటి ప్రచారం
అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా దయానంద్ పర్యటన
కాకతీయ, కల్లూరు : కల్లూరు మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం శుక్రవారం మరింత ఉద్ధృతమైంది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేత డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ కలిసి విస్తృత స్థాయి ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని 3వ, 4వ, 18వ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని వారు ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి, పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కల్లూరు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కొనసాగించాలంటే కాంగ్రెస్ అభ్యర్థుల విజయమే కీలకమని నేతలు పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వాన్ని ఎన్నుకోవాలని, స్థానిక సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో కల్లూరు ఏఎంసీ చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పసుమర్తి చంద్రరావు, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


