పోలీసు వాహనాలను కండిషన్లో ఉంచుకోవాలి
జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : పోలీస్ స్టేషన్లోని వాహనాలను ఆయా డ్రైవర్లు తప్పకుండా కండిషన్లో ఉంచాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సూచించారు. సోమవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జిల్లాలోని అన్నీ పోలీస్ స్టేషన్లు ఇతర అధికారుల వాహనాలను తనిఖీ చేశారు.జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు పోలీస్ వాహనాల రవాణాధికారి ఆర్ఐ సుధాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పోలీస్ వాహనాలను ఎస్పీ తనిఖీ చేశారు.దీనిలో భాగంగా జిల్లాలోని పోలీస్ డ్రైవర్స్ సమస్యలు,డ్యూటీలో భాగంగా వారి పనితీరును గురించి ఎస్పీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు.త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని అన్ని పోలీసు వాహనాలను మంచి కండీషన్లో ఉంచుకోవాలని డ్రైవర్లకు ఎస్పీ సూచించారు.ప్రతి వెహికల్ కండిషన్ను ఎస్పీ ప్రత్యేకంగా పరిశీలించారు.పోలీస్ శాఖలో డ్రైవర్లుగా పనిచేసే వారు ఖచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని సూచించారు.శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ అధికారులు,సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండడంలో పోలీసు వాహనాల డ్రైవర్ల పాత్ర చాలా కీలకమని అన్నారు.ప్రతీ డ్రైవర్ కు తమ వాహన పనితీరు గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.డ్రైవర్లు తమ విధుల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.వాహన తనిఖీల సమయాల్లో తగు జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు.అత్యవసర సమయాల్లో విధులు నిర్వర్తించేటప్పుడు ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని తెలిపారు.విధుల పరంగా ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,ఆర్ఐ ఎంటిఓ సుధాకర్ అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు,వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు ఇతర అధికారులు పాల్గొన్నారు.


