కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: నగరంలోని శ్రీనివాస్ నగర్ లో వ్యభిచార గృహంపై మంగళవారం మూడో పట్టణ, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. స్థానికుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు నిర్వాహకులు, ఒక్క విటుడిని అదుపులోకి తీసుకొని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సీఐ మోహన్ బాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీనివాస్ నగర్ లో ప్రశాంతి నిలయంలో ఇద్దరు మహిళలు వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. దాడిలో ఇద్దరు మహిళా నిర్వాహకులు, ఒక్క విటుడిని పట్టుకున్నారని, వారిపై కేసు నమోదు చేశామని చెప్పారు.


