*మోదీ, పుతిన్ ఒకే కారులో కలిసి ప్రయాణం
*భారత్–రష్యా మధ్య సాన్నిహిత్యం, విశ్వాసానికి ప్రతీక
*రక్షణ, చమురు, వాణిజ్యం వంటి రంగాల్లో బలపడుతున్న సంబంధాలు
*ఉక్రెయిన్ యుద్ధం అనంతరం భారత్ రష్యాతో వ్యాపార సంబంధాలు
* మోదీ–పుతిన్ ప్రయాణం అంతర్జాతీయంగా విశేష చర్చ
కాకతీయ, తెలంగాణ బ్యూరో: అంతర్జాతీయ వేదికపై ఒక ప్రత్యేక క్షణం చోటుచేసుకుంది. భారత ప్రధాని నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇద్దరూ ఒకే కారులో కలిసి ప్రయాణించారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో పెద్ద పెద్ద సదస్సుల్లో దేశాధినేతలు వేర్వేరు కార్ల కాన్వాయ్ ల్లో వేదికల దగ్గరకు చేరుకుంటారు. కానీ తింజియన్ లోని షాంఘై సహకార సదస్సుల్లో మాత్రం భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకే కారులో వేదిక వద్దకు చేరుకోవడం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీ ట్విట్టర్ లో షేర్ చేశారు.
ఎస్ సీవో సదస్సు వేదిక వద్ద ప్రొసీడింగ్స్ ముగిసిన అనంతరం అధ్యక్షుడు పుతిన్..నేను కలిసి ఒకే కారులో మా ద్వైపాక్షిక భేటీ దగ్గరకు చేరుకున్నాం. ఇద్దరి మధ్య చర్చలు ఎప్పుడూ లోతుగా జరుగుతాయని పేర్కొన్నారు. ఇరు దేశాధినేతల మధ్య నెలకున్న స్నేహబంధానికి ఈ జర్నీ గుర్తుగా నిలిచింది.
షాంఘై సహకార సదస్సుకు పుతిన్ తన వాహన కాన్వాయ్ ను తీసుకువచ్చారు. దీనిలో ఆయన వాడే ఆరస్ సెనేట్ లిమోసిన్ కూడా ఉంది. దీనికి ప్రత్యేకంగా చైనా డిప్లొమేటిక్ లైసెన్స్ ను కేటాయించింది. అమెరికా అధ్యక్షుడు వాడే బీస్ట్ లా దీనిలో కూడా రష్యా అధినేత రక్షణకు చాలా ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు చాలా ఆకట్టుకునే విధంగా రూల్స్ రాయిస్, బెంట్లీ మోడల్స్ ను కలిపి తయారు చేసినట్లుగా ఉంది. అత్యంత విలాసవంతంగా ఉన్న ఈ వెహికల్ లో 4.4 లీటర్ వీ8 పెట్రోల్ -హైబ్రీడ్ ఇంజిన్ ను వాడారు. ఇది 598 పీఎస్, 880 ఎన్ఎం శక్తిని విడుదల చేస్తుంది.
రష్యా ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీసెస్ ప్రమాణాలకు తగ్గట్లుగా దీన్ని తయారు చేశారు. రష్యాకు చెందిన ఎన్ఏఎంఐ దీనిని స్వయంగా రూపొందించింది. 2018లో పుతిన్ నాలుగోసారి ప్రమాణస్వీకారం సందర్భంగా ఇది విధుల్లోకి వచ్చింది. దాదాపు 7 టన్నుల బరువు ఉంటుందని సమాచారం.
బుల్లెట్ ప్రూఫ్ వెహికల్. బాంబు దాడులను కూడా తట్టుకుంటుంది. వీఆర్ 10 బాలిస్టిక్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న మెటిరీయల్ తో దీన్ని నిర్మించారు. దీనిలో రసాయన దాడి నుంచి అధ్యక్షుడిని రక్షించేందుకు అన్ని ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. అదనపు ఆక్సిజన్ అందించేందుకు ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదాలకు నివారించే వ్యవస్థ ఇందులో ఉంది.


