- పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
కాకతీయ, పినపాక: పినపాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మండలంలోని గోపాలరావుపేట, తోగూడెం గ్రామాల నుంచి 60 కుటుంబాలు స్థానిక కాంగ్రెస్ నాయకులు అచ్చా నవీన్, డొంకెన సాంబశివరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరాయి. ఈ సందర్భంగా వారందరికీ ఎమ్మెల్యే పాయం పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలనతో నిజమైన పేదలకు, మధ్య తరగతి కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు.
రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన వెంటే ప్రజలు ఉంటారన్నారు. బీఆర్ఎస్ నాయకులు అహంకారం, అసహనంతో కాంగ్రెస్ పార్టీ మీద అర్థం లేకుండా మాట్లాడడం వల్ల ప్రజాదరణ కోల్పోయారన్నారు. ఏడూళ్ల బయ్యారంలో జడ్పీ హై స్కూల్ లో జరగనున్న అండర్ 17 క్రీడా ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొడిశాల రామనాథం, మాజీ వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, సీనియర్ నాయకులు గంగిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి, అచ్చా నవీన్, డొంకెన సాంబశివరావు, మల్లేశ్, కొండేరు సంపత్, బండారు సాంబ, సతీష్ చారీ, కొంపెల్లి నాగేశ్వరరావు, అంకతి సిద్దయ్య, రామకృష్ణ, జంపయ్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు.


