- ఎస్పీ రోహిత్ రాజు
కాకతీయ, భద్రాద్రి కొత్తగూడెం : ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. సెల్ఫీల కోసం ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రదేశాలకు వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని, నదులు, వాగులు, వంకల వద్దకు జాలర్లు, ప్రజలు చేపల వేటకు వెళ్ళకూడదని సూచించారు. పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అత్యవసర సమయాల్లో తప్పా బయటకు రాకూడదని తెలిపారు. ప్రజలు ఎవరైనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లయితే వెంటనే డయల్ 100 కి ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు.


