epaper
Saturday, November 15, 2025
epaper

నెలలో మొదటి రోజునే ఠంచనుగా పింఛన్ల పంపిణీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం పింఛను దారులకు ప్రతి నెల మొదటి రోజునే ఠంచనుగా పింఛన్లను అందించి ఆర్థిక భద్రత కల్పిస్తోందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఆయన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ (డిసిఎంఎస్) బండి రామకృష్ణతో కలిసి నగరంలోని 12వ డివిజన్ నోబుల్ కాలనీలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఇంటింటికి తిరిగి స్వయంగా పింఛన్లు అందించి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రూ.200 ల పింఛన్ మొత్తాన్ని ఒకేసారి రూ.2 వేలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. ప్రస్తుతం మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పింఛను రూ. 3 వేల నుంచి రూ.4 వేలకు పెంచి పింఛనుదారులను ఆర్థికంగా ఆదుకుందన్నారు. వికలాంగులకు రూ.6 వేలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి రూ.10 వేలు, పూర్తిగా మంచానికే పరిమితమై లేవలేని స్థితిలో ఉన్న అభాగ్యులకు రూ.15 వేలు పింఛన్ అందించి వారి జీవితాలకు అండగా నిలబడిందన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా దాదాపు 64 లక్షల మందికి ఈ సాయం ఆంధ్రప్రదేశ్‌లో లభిస్తోందని అన్నారు. అదేవిధంగా దీపం పథకం కింద మూడు కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకం కింద 68 లక్షల మంది విద్యార్థులకు దాదాపు రూ.10 వేల కోట్ల నిధుల జమ, అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు పీఎం కిసాన్ తో కలిపి తొలి విడతగా రూ.7 వేలు అందించామని, త్వరలో మరో విడతగా రూ.7 వేలు అందించనున్నామని మంత్రి తెలిపారు.

ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల జీవితాల్లో వెలుగునింపుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరి ఇంటికీ సంక్షేమ పథకాలు చేరవేయడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటోందన్నారు. ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా, పేదల కష్టాలు తగ్గించేలా పాలన సాగుతోందని ఆయన పేర్కొన్నారు.

కార్యక్రమంలో మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ మెంబర్ లంకె నారాయణ ప్రసాద్, నగర మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, మచిలీపట్నం టౌన్ పార్టీ ప్రెసిడెంట్ లోగిశెట్టి వెంకట స్వామి, 12వ డివిజన్ ఇంచార్జ్ బొమ్మిడి శ్రీరాములు, మాదివాడ రాము తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కళ్యాణదుర్గంలో లోకేష్ ప్రజాదర్బార్

కళ్యాణదుర్గంలో లోకేష్ ప్రజాదర్బార్ ప్రజల‌ నుంచి వినతులు స్వీకరించిన మంత్రి అన్ని విధాల అండగా...

గుంత‌లు లేని దారులే మా ప్ర‌భుత్వ ల‌క్ష్యం

ప్రజల చేతిలో పల్లె రహదారుల సమాచారం త్వరలో అందుబాటులోకి ‘జియో...

శ్రీ చరణికి రూ.2.5 కోట్ల నజరానా

ఇంటి నిర్మాణానికి 1000 చ.గ. స్థలం గ్రూప్ 1 ఉద్యోగం...

జ‌గ‌న్ ప్ర‌భుత్వంలోనే ఎస్సీ, ఎస్టీల‌కు న్యాయం

కోట మండ‌ల వైసీపీ అధ్య‌క్షులు రాయంకుల‌ కాక‌తీయ. ఏలూరు ప్ర‌తినిధి :...

గిరిజన ‘గూడెం’లో తొలిసారి విద్యుత్ కాంతులు

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో గూడెంకు వెలుగులు కేంద్ర...

కృష్ణా నదిపై హై లెవెల్ వంతెన

దీవుల్లోని గ్రామాలకు అనుసంధానం రాష్ట్ర నిధులతోపాటు, సాస్కీ పథకం నిధులు...

దైవ‌ద‌ర్శ‌నంలో మృత్యుఘోష‌

దైవ‌ద‌ర్శ‌నంలో మృత్యుఘోష‌ శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ ఆలయంలో తొక్కిసలాట 9 మంది భ‌క్తులు మృతి మృతుల్లో...

ఆలయంలో తొక్కిసలాట

9 మంది భ‌క్తులు మృతి మృతుల్లో బాలుడు.. ఎనిమిది మంది...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img