పెండింగ్ డీఏలను విడుదల చేయాలి
సుజాతనగర్ మండల టీఎస్ యూటీఎఫ్ నూతన కమిటీ ఎన్నిక
కాకతీయ, కొత్తగూడెం : ఉపాధ్యాయుల పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని టీఎస్ యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. కొత్తగూడెం టీఎస్ యూటీఎఫ్ టీచర్ భవన్ లో ఆదివారం సుజాతనగర్ మండల కమిటీ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా టీఎస్ యూటీఎఫ్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ రాజయ్య పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్నటువంటి పీఆర్సీ అమలు చేయాలని పెండింగ్ డిఎలను మంజూరు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు.
సుజాతనగర్ మండల కమిటీ ఎన్నిక
అనంతరం సుజాతనగర్ మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా జి.రాజారావు, జనరల్ సెక్రెటరీగా ఎం.రాందాస్, వైస్ ప్రెసిడెంట్గా జయబాయి, వీరభద్రమ్మ, ట్రెజరర్ గా బి.భాస్కరరావు, సెక్రటరీలుగా సుజాత, కృష్ణకుమారి, నరసింహారావు, పద్మ, సబ్ కమిటీ మెంబర్ గా బి.సీతారాం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మండల కమిటీ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా జి.నాగేశ్వరావు హాజరయ్యారు. ఈ సమావేశానికి జిల్లా కోశాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శులు తావూరియా, బిక్కు, దాసు, ఈరు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.


