ఘనంగా పండిత్ దీన్ దయాల్ జయంతి
కాకతీయ, ఇనుగుర్తి : మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు దుంపల సందీప్ ఆధ్వర్యంలో శ్రీ పండిత్ దీన్ దయల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశా ఐక్యత కోసం పోరాడిన మహనీయుడని ఆర్ఎస్ఎస్ లో క్రియాశీలకంగా సేవలు అందించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర పోలేపల్లి వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షుడు పసునూరు విష్ణు, మండల ప్రధాన కార్యదర్శిలు కామినేని బాలరాజు, గుజ్జు నూరి నరేష్, మండల కార్యదర్శులు కుల వెంకన్న, బోడ నరేష్, వల్లం ల రాజేందర్, గోన శీను, ఎస్సీ మోర్చా అధ్యక్షులు మందుల బాబు, యువమోర్చా అధ్యక్షులు వెంపటి సందీప్, ఎస్టి మోర్చా అధ్యక్షులు సురేష్ ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి భాను సుధాకర్, భానోత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.


