ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి
లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి అనిల్
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని మధురానగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిల్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యండడ్ గా పట్టుబడ్డాడు. పంచాయతీ కార్యదర్శి లంచం డిమాండ్ చేస్తున్నట్టు ఫిర్యాదు రావడంతో.. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారుల ఉచ్చులో చిక్కినట్లు ప్రాథమికంగా తెలుస్తున్న సమాచారం. అందిన సమాచారం మేరకు. గంగాదర మండలం మధురానగర్ గ్రామ పంచాయతీ సంబంధిత ఇందిరమ్మ ఇంటి బిల్లు కోసం ఒక వ్యక్తి దగ్గర గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిల్ రూ.10 వేలు డిమాండ్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని బాధితుడు ఏసీబీ అధికారులకు తెలియజేయడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికతో ట్రాప్ చేసి బాధితుడు వద్ద నుండి పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యండడ్‌గా పట్టుకున్నట్లు తెలుస్తుంది. పంచాయతీ కార్యదర్శి అనిల్ అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు లంచం తీసుకున్న మొత్తం, సంబంధిత పత్రాలు, రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అంతే కాకుండాపంచాయతీ కార్యలయంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్న సమాచారం. కాగా ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.


