సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలకు కరపత్రం విడుదల
27న గడ్డిగుట్టలో భోగ్ బండార్ అన్నదానం
బంజారా నాయకులు, ప్రజలు పాల్గొనాలని పిలుపు
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : సేవాలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా నిర్వహించనున్న భోగ్ బండార్ అన్నదాన కార్యక్రమానికి సంబంధించి కరపత్రాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లావుడియా ప్రసాద్ నాయక్, జిల్లా అధ్యక్షుడు నునావత్ రాంబాబు నాయక్, గడ్డిగుట్ట సర్పంచ్ బోడా సంతు నాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా లావుడియా ప్రసాద్ నాయక్ మాట్లాడుతూ ఈనెల 27న లక్ష్మీదేవిపల్లి మండలం గడ్డిగుట్ట గ్రామపంచాయతీ పరిధిలో జయంతి వేడుకలు, భోగ్ బండార్ అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారా సమాజానికి మార్గదర్శకుడిగా నిలిచారని, ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి లక్ష్మీదేవిపల్లి మండలంలోని బంజారా నాయకులు, సర్పంచులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బట్టు స్వరూప, వార్డు సభ్యులు బోడ నానియా నాయక్, భూక్యా మల్చూర్ నాయక్, బట్టు రమేష్ నాయక్, లావుడియా శాంతిబాయి, భూక్యా బుజ్జిబాయి, బోడ సాలిబాయి, లావుడియా కుమార్ నాయక్, బట్టు రవి నాయక్, లావుడియా సీతారాములు నాయక్, లావుడియా శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


