కాకతీయ, వెబ్ డెస్క్: కొడకండ్ల మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు గృహ నిర్మాణ మంజూరు పట్టాలను పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజల గృహ స్వప్నాన్ని నెరవేర్చడం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇల్లు లేని ప్రతి కుటుంబానికి సొంత గృహం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. లబ్ధిదారులు పట్టాలను సద్వినియోగం చేసుకోవాలని, త్వరలో గృహనిర్మాణానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మాజీ సర్పంచులు, పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.




