నంద తండా బీఆర్ఎస్ అభ్యర్థికి వనమా ఆశీర్వాదం
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : నందా తండా గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ అభ్యర్థిని బలరాంను మాజీమంత్రి వనమా వెంకటేశ్వర్లు ఆశీర్వదించారు. శుక్రవారం నందా తండా పంచాయతీకి చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి బలరాం మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థి బలరాం మాట్లాడుతూ రాజకీయంలోకి ఎందరో యువకులను తయారు చేసి సమాజానికి అందించిన ఘనత వనమ వెంకటేశ్వరరావుదని ఈసందర్భంగా అభ్యర్థి రాము పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు మాలోత్ శ్రీరామ్ సహా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


