epaper
Sunday, March 1, 2026
epaper

కర్రెగుట్టలో ‘ఆపరేషన్ కగార్-2’ నిలిపివేయాలి

కర్రెగుట్టలో ‘ఆపరేషన్ కగార్-2’ నిలిపివేయాలి
ఆదివాసీలపై చర్యలను ఖండించిన సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై డివిజన్ కార్యదర్శి నాగయ్య విమర్శలు

కాకతీయ, తుంగతుర్తి : కర్రెగుట్ట ప్రాంతంలో కొనసాగుతున్న ‘ఆపరేషన్ కగార్-2’ను వెంటనే నిలిపివేయాలని సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తుంగతుర్తి డివిజన్ కార్యదర్శి పేర్ల నాగయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం తుంగతుర్తిలో విడుదల చేసిన పత్రిక ప్రకటనలో ఆయన కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చాలనే పేరుతో కేంద్ర ప్రభుత్వం భారీగా భద్రతా బలగాలను మోహరించి, క్యాంపులు ఏర్పాటు చేస్తోందని ఆరోపించారు. ఈ చర్యల వల్ల ఆదివాసీలపై తీవ్ర ప్రభావం పడుతోందని, నిరపరాధ ప్రజలపై హింస కొనసాగుతోందని పేర్కొన్నారు. దండకారణ్య ప్రాంతంలో ఉన్న సహజ వనరులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆరోపిస్తూ, ప్రజల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఏవైనా ఆరోపణలు ఉంటే రాజ్యాంగ పరమైన విధానాల్లో విచారణ జరపాలని, ప్రజలపై బలప్రయోగం చేయడం తగదన్నారు. ఈ చర్యలను ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు ఖండించాలని పిలుపునిస్తూ, ఆపరేషన్‌ను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నందికొండలో కాంగ్రెస్ ఏకపక్ష విజయం.. నాగార్జునసాగర్ కూడా హస్తగతం

నందికొండలో కాంగ్రెస్ ఏకపక్ష విజయం.. నాగార్జునసాగర్ కూడా హస్తగతం నాగార్జునసాగర్ మున్సిపాలిటీని కైవసం...

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా..

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా.. హాలియా, నందికొండ మున్సిపాలిటీల కైవసం హాలియాలో 12లో 11...

తూర్పుగూడెంలో విద్యార్థుల స్వపరిపాలన

తూర్పుగూడెంలో విద్యార్థుల స్వపరిపాలన ఉపాధ్యాయులుగా మారిన చిన్నారులు కలెక్టర్‌, ఎమ్మెల్యే పాత్రల్లో విద్యార్థుల వినూత్న...

అవినీతి బీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలి

అవినీతి బీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి కార్యకర్తలంతా ఐక్యంగా...

ట్విట్టర్ టిల్లు మాటలతో ప్రజలు మోసపోరు

ట్విట్టర్ టిల్లు మాటలతో ప్రజలు మోసపోరు కేటీఆర్ వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్‌రెడ్డి...

రాష్ట్ర స్థాయి క్రీడల్లో విద్యార్థుల ప్ర‌తిభ

రాష్ట్ర స్థాయి క్రీడల్లో విద్యార్థుల ప్ర‌తిభ కాకతీయ, తుంగతుర్తి : తెలంగాణ క్రీడ...

ఏసీబీకి చిక్కిన గానుగబండ గ్రామ కార్యదర్శి

ఏసీబీకి చిక్కిన గానుగబండ గ్రామ కార్యదర్శి లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టివేత‌ ఇంటిలో, కార్యాలయంలో...

అమెరికా దురాక్రమణపై ప్రపంచం గళమెత్తాలి

అమెరికా దురాక్రమణపై ప్రపంచం గళమెత్తాలి ట్రంప్ సామ్రాజ్యవాద అహంకారాన్ని ఖండించాలి వెనుజువేలాపై సహజ సంపదల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img