అధికార పార్టీ అభ్యర్థులనే గెలిపించాలి
: ఎమ్మెల్యే కవ్వంపల్లి
కాకతీయ, కరీంనగర్ : అధికార పార్టీ ఆశీర్వాదంతో నిలబడ్డ అభ్యర్థులను సర్పంచులుగా గెలిపిస్తేనే గ్రామాల అభివృద్ధి వేగవంతమవుతుందని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గురువారం ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు, కందికట్కూర్, ఓగులాపూర్, వెల్జీపూర్, గొల్లపల్లి, వెంకట్రావుపల్లి, సోమారంపేట, రేపాక గ్రామాల్లో సర్పంచు అభ్యర్థులతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే గత బీఆర్ఎస్ పాలనలో పంచాయతీ వ్యవస్థ కుంగిపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీల బలోపేతానికి చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమాల్లో సర్పంచు అభ్యర్థులు జేరిపోతుల పద్మ, పరశురామ్ (పొత్తూరు), యాస శైలజ, తిరుపతి (కందికట్కూర్), ముక్కిస వసంత, కేశవరెడ్డి (ఓబులాపురం), నాయిని నవీన్‌కుమార్ (వెల్జీపూర్), కడగండ్ల శిరీష,తిరుపతి (గొల్లపల్లి), చల్లా నవీన్‌రెడ్డి (వెంకట్రావుపల్లి), కేతిరెడ్డి భారతమ్మ–లక్ష్మారెడ్డి (సోమారంపేట), కాత మల్లేశం (రేపాక) తదితరులు పాల్గొన్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఊట్కూరి వెంకటరమణారెడ్డి, గుడిసె అయిలయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.


