“అవ్వా… కారు గుర్తుకే ఓటేయాలే!”
క్యాతన్‌పల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ వినూత్నంగా అవ్వతో ముచ్చటించారు. “అవ్వా… కారు గుర్తుకు ఓటు వేయాలే, మన ఊరు అభివృద్ధి కావాలంటే అదే మార్గం” అంటూ అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రూ.4000 పెన్షన్ హామీ అందుతున్నదా అని ప్రశ్నించగా, “లేదు బిడ్డా” అని అవ్వ సమాధానమిచ్చింది. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దని బాల్క సుమన్ పిలుపునిచ్చారు. ఈ సంభాషణ స్థానికులను ఆకట్టుకుంది. – కాకతీయ, రామకృష్ణాపూర్


