సర్పంచ్ అభ్యర్థిపై క్షుద్రపూజలు..
ఖమ్మం జిల్లా గోళ్లపాడులో కలకలం
కాకతీయ, ఖమ్మం రూరల్ : ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు గ్రామంలో ఎన్నికల వేళ కలకలం రేగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తొండల రవికి కేటాయించిన కత్తెర గుర్తు ఉన్న నమూనా బ్యాలెట్ పత్రాన్ని క్షుద్ర పూజలకు వినియోగించిన వీడియోలు వెలుగులోకి రావడంతో గ్రామమంతా షాక్‌కు గురైంది. క్షుద్ర పూజలకు సంబంధించిన వస్తువులను గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ఉంచినట్లు సమాచారం.
ఈ ఘటన వెనుక ప్రత్యర్థి అభ్యర్థికి చెందిన వారే ఉన్నారన్న అనుమానాలను గ్రామస్థులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఎవరు చేశారన్న అంశంపై ఇప్పటివరకు అధికారికంగా స్పష్టత రాలేదు. రెండో దశ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం గ్రామంలో భయాందోళ నలకు దారి తీసింది. ఘటనపై అధికారులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు కోరుతున్నారు.


