కాకతీయ, పినపాక: సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 16 వరకు 8వ రాష్ట్రీయ పోషణ మాసం వేడుకలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామని సిడిపిఓ జయలక్ష్మి తెలిపారు. మంగళవారం పినపాక మండలం భూపాలపట్నం గ్రామంలో నిర్వహించిన పోషణ మాసం అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ముందుగా అంగన్వాడీలతో కలిసి పోషణ మాసం ప్రతిజ్ఞ చేశారు. అనంతరం సిడిపిఓ జయలక్ష్మి మాట్లాడుతూ పోషకాహార భద్రత, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యతను వివరించారు. చిన్నారులకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు నేర్పాలని, బాల్య దశ సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
శిశు పోషణకు బలమైన పునాది వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పద్మ, పోషణ అభి యాన్స్ నాగేశ్వరరావు, స్థానిక అంగన్వాడీల టీచర్లు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు పాల్గొన్నారు.


