భరతనాట్యంలో మొదటి బహుమతి సాధించిన నిధిశ్రీ
అభినందించిన హార్వెస్ట్ స్కూల్ యాజమాన్యం
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: భద్రశైల డ్యాన్స్ కాంపిటీషన్ -2025 ను పాల్వంచ పట్టణం కేటీపీఎస్ కాలనీలోని సీతారామ కల్యాణ మండపంలో నిర్వహించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 200 మంది తరలివచ్చి నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. కైరాలి నాట్య నిలయం అశోక్ కుమార్ శిష్యురాలు ఖమ్మం హార్వెస్ట్ టెండర్ రూట్ స్కూల్ చెందిన చిన్నారి నిధి శ్రీ నందన నిర్వహించిన నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు భరతనాట్యం కేటగిరిలో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. నిర్వహకులు రాందేవ్ రామ్ నిధిశ్రీనందన కు ప్రశంసాపత్రంతో పాటు మెమోంటో ను బహుకరించారు. ఈ సందర్భంగా హార్వెస్ట్ స్కూల్ యాజమాన్యం రవిమారుతి, పార్వతిరెడ్డి చిన్నారి నిధిశ్రీ నందన ను అభినందించారు. తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళం, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చిన కళాకారులు పోటీలలో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. మన ఖమ్మం జిల్లా చిన్నారి ప్రధమ బహుమతి పొందడం విశేషం.


