epaper
Sunday, March 1, 2026
epaper

రైతు భరోసాకు కొత్త నిబంధనలు!

రైతు భరోసాకు కొత్త నిబంధనలు!
సాగులో ఉన్న భూములకే ఇక సాయం
శాటిలైట్ సర్వేతో సాగులో లేని 20 లక్షల ఎకరాలు గుర్తింపు
మున్సిపల్ ఎన్నికల తర్వాతే నిధుల జమ చేసేందుకు ప్ర‌య‌త్నం
అర్హులైన‌ రైతులకే లబ్ధి లక్ష్యంగా ప్రభుత్వం చ‌ర్య‌లు

కాకతీయ, తెలంగాణ బ్యూరో : రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటివరకు భూమి పేరుపై నమోదైన ప్రతి ఎకరానికి సాయం అందిస్తుండగా, ఇకపై నిజంగా సాగులో ఉన్న భూములకే నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూముల గుర్తింపు ప్రక్రియ దాదాపు పూర్తికావడంతో, త్వరలోనే ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. రైతు భరోసా పథకాన్ని మరింత పారదర్శకంగా మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సమగ్ర సర్వే చేపట్టింది. గతంలో సాగు చేయని భూములు, కొండలు–గుట్టలు, రియల్ ఎస్టేట్ ప్లాట్లు, జాతీయ రహదారుల పరిధిలోని భూములకు కూడా పెట్టుబడి సాయం వెళ్లినట్లు ప్రభుత్వం గుర్తించింది. దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్న విమర్శల నేపథ్యంలో, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆధునిక శాటిలైట్ సాంకేతికతతో సర్వే నిర్వహించారు. సింథటిక్ ఎపర్చర్ రాడార్ టెక్నాలజీ ద్వారా జరిగిన ఈ సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 1.53 కోట్ల ఎకరాల భూమిని పరిశీలించగా, దాదాపు 20 లక్షల ఎకరాల్లో అసలు పంటల సాగు జరగడం లేదని తేలింది. దీంతో ఈ భూములకు ఇకపై రైతు భరోసా నిధులు నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

మున్సిపల్ ఎన్నికల తర్వాతే నిధులు

రైతు భరోసా నిధుల విడుదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. ఫిబ్రవరి 4న మిర్యాలగూడ సభలో ఆయన మాట్లాడుతూ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని తెలిపారు. యాసంగి సీజన్‌కు సంబంధించి సుమారు రూ.9,000 కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్లే నిధుల జమ ఆలస్యం అవుతోందని, ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే అర్హులైన 65 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.6,000 చొప్పున నేరుగా నగదు జమ అవుతుందని సీఎం హామీ ఇచ్చారు.

క్షేత్రస్థాయిలోనూ వెరిఫికేషన్

శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా గుర్తించిన వివరాల్లో పొరపాట్లు జరగకుండా ఉండేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఏఈఓల ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించి, నిజంగా సాగులో లేని భూములను తుది జాబితా నుంచి తొలగిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిన భూములు, ఫామ్ హౌస్‌లు, నివాస ప్రాంతాలుగా మారిన స్థలాలను కూడా ఈ జాబితా నుంచి తప్పిస్తున్నారు. కేవలం పంటలు పండించే నిజమైన రైతులకే పెట్టుబడి సాయం అందాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మార్పుల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నిధులు ఆదా అవుతాయని, ఆ మొత్తాన్ని నిజమైన రైతుల సంక్షేమానికి మరింత సమర్థంగా వినియోగించవచ్చని అభిప్రాయపడుతున్నారు. రైతు భరోసా పథకంలో తీసుకొస్తున్న ఈ మార్పులు పారదర్శకతకు, న్యాయమైన లబ్ధి పంపిణీకి దోహదపడతాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img