పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ గా నరాల సత్యనారాయణ
కాకతీయ ఖమ్మం : తెలంగాణ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ గా నరాల సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ పొలిటికల్ జేఏసీ రెండు తీర్మానాలు చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల కోసం రెండు వేల మందితో ఇందిరాపార్కు వద్ద ధర్నా మరియు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని, 3500 మందితో ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేయాలని తీర్మానించారు. తెలంగాణ పొలిటికల్ జేఏసీ ప్రజా సమస్యలపై రాజీలేనిపోరాటం చేస్తుందని, ప్రజలే మా ధైర్యం , ప్రజల కోసమే మా పోరాటం అనే నినాదంతో ఏర్పడినదే తెలంగాణ పొలిటికల్ జేఏసీ అని అన్నారు. వైస్ చైర్మన్ గా ధారావత్ గణేష్ నాయక్ , వట్టం ఉపేందర్ , అంగోతు రాంబాబు , సెక్రటరీ జనరల్ గా బత్తుల సోమయ్య , ప్రధాన కార్యదర్శిగా బానోతు హుస్సేన్ నాయక్ , పూనెం శ్రీనివాస్ , అధికార ప్రతినిధిగా తోడేటి శంకర్ గౌడ్ , అనంతుల మధు , రాష్ట్ర కార్యదర్శులుగా తుల్జా రెడ్డి , పాలకుర్తి కృష్ణ , సంగిశెట్టి క్రిస్టా ఫర్ , మహిళా కార్యదర్శిలుగా కంచర్ల మంజూష , కందుకూరి శ్వేత , సింగరాజు శ్యామల, రాష్ట్ర కమిటీ సభ్యులుగా మాలోతు రామన్న నాయక్ , తునికి పాటి చారి , ఇస్లావత్ సంతోష్ నాయక్ , కుక్క సత్యం గౌడ్ ను నియమించినట్లు తెలంగాణ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ పేర్కొన్నారు


