epaper
Sunday, March 1, 2026
epaper

వైట్‌హౌస్ విందులో మ‌స్క్‌.. ట్రంప్ తో విభేదాలు ముగిసిన‌ట్లేనా?

వైట్‌హౌస్ విందులో మ‌స్క్‌.. ట్రంప్ తో విభేదాలు ముగిసిన‌ట్లేనా?
ఎంఎస్‌బీఎస్ అమెరికా పర్యటన సంద‌ర్భంగా ట్రంప్‌ ప్రత్యేక విందు
వైట్‌హౌస్ విందులో స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా ఎలాన్ మస్క్‌
మస్క్–ట్రంప్ విభేదాల‌పై ఊపందుకున్న చ‌ర్చ‌లు

కాక‌తీయ‌, అంత‌ర్జాతీయం : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మరియు టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ మధ్య నెలకొన్న విభేదాల గురించి అందరికీ తెలిసిందే. ఒక కీలక బిల్లు అంశంపై ఇద్దరి మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు తలెత్త‌డంతో ఘర్షణలు మొదలయ్యాయి. మస్క్ బహిరంగంగానే ట్రంప్ ప్రభుత్వంపై విమర్శలు చేయ‌డంతో వారిని సన్నిహితుల నుంచి ప్రత్యర్థుల దిశగా తీసుకెళ్లాయి. అనంతరం మస్క్‌ వైట్‌హౌస్ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు.

అయితే తాజాగా ఈ పరిస్థితులు మారినట్టుగా కనిపించాయి. విభేదాల తర్వాత తొలిసారిగా మస్క్‌ వైట్‌హౌస్‌ కార్యక్రమానికి హాజరై అందరి దృష్టినీ ఆకర్షించారు. సుమారు ఏడు సంవత్సరాల విరామం అనంత‌రం సౌదీ క్రౌన్ ప్రిన్స్‌ మహమ్మద్ బిన్ సల్మాన్‌ (ఎంఎస్‌బీఎస్) అమెరికా పర్యటనకు రావ‌డంతో అధ్యక్షుడు ట్రంప్‌ వైట్‌హౌస్‌లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందు గ్లోబల్ మీడియా దృష్టిని ఆకర్షించిన వేళ… మస్క్‌ హాజరు మరింత ఆసక్తిని రేకెత్తించింది.

ఆ విందు ఒక రకం స్టార్-స్టడెడ్ ఈవెంట్‌గా మారింది. ప్రపంచ ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో, ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్‌ కూడా హాజరయ్యారు. గ్లోబల్ స్థాయిలో పాలిటిక్స్, టెక్, స్పోర్ట్స్ రంగాల ప్రముఖులు ఒకేచోట సమావేశం కావడం అరుదైన సందర్భంగా మారింది. అందులోనూ మస్క్‌ హాజరు పాలిటికల్ వర్గాల్లో కొత్త చర్చలకు దారితీసింది. ట్రంప్ తో మ‌న‌స్ప‌ర్థ‌లు ఏర్ప‌డిన తర్వాత వైట్‌హౌస్ ఈవెంట్‌లో మ‌స్క్ తొలిసారి పాల్గొనడంతో ఇద్దరి మధ్య విభేదాలు ముగిసిన‌ట్లేనా? ఇవి మళ్లీ సన్నిహిత సంబంధాలు పునరుద్ధరించే ప్రయత్నాలేనా? అన్న ప్రశ్నలు ఊపందుకున్నాయి. కాగా, అమెరికా పాలసీల్లో టెక్ రంగం కీలక పాత్రలో ఉన్న నేపథ్యంలో, మస్క్–ట్రంప్ సంబంధాలు ఎలా మారుతాయన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం భారీ జరిమానాను...

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి...

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి ల్యాండ్ అవుతుండ‌గా రన్‌వేపై కుప్ప‌కూలిన చార్టర్డ్...

కర్తవ్యపథ్‌పై గర్వభారతం!

కర్తవ్యపథ్‌పై గర్వభారతం! డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img