- జలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు
- సహాయక చర్యల్లో పోలీసుల పాత్ర కీలకం
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: మున్నేరు ఉగ్రరూపం దాల్సుతుంది. గతేడాదిని మరిపిస్తూ ఈ ఏడాది కూడా 25 అడుగులకు వరద పెరగడంతో స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. జిల్లా యంత్రాంగం ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టి లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసింది. రాత్రి నుండి తెల్లార్లు పోలీసు అధికారులు మున్నేటి పరివాహక ప్రాంతంలో గస్తీ కాస్తూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. గురువారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, నగరపాలక సంస్థ కమిషనర్ల ఆధ్వర్యంలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. త్రీ టౌన్ పోలీసులు మరింత చురుగ్గా పాల్గొంటున్నారు.


