ఘనంగా ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి మహోత్సవం
కాకతీయ, జూలూరుపాడు : ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి మహోత్సవం సందర్భంగా మండలంలోని జూలూరుపాడు,పడమట నర్సాపురం,గుండెపూడి,పాపకొల్లు,వెంగన్నపాలెం,కాకర్ల,అనంతారం, కరివారిగూడెం తదితర గ్రామాల్లో వెచ్చిసివున్న దేవాలయాల్లో రామనామ,హరినామ స్మరణతో ముక్కోటి ఏకాదశి వేడుకలను అంగ రంగ వైభవంగా జరుపుకొన్న భక్తులు.పడమట నర్సాపురం గ్రామంలో వేచ్చేసివున్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మంగళం వారం నాడు శ్రీ సీతారామచంద్ర స్వామి దేవతామూర్తులను తెల్లవారు జామున గంటల 5.30 నిమిషాల నుండి భక్తులకు ఉత్తరద్వార దర్శనాన్ని కల్పించారు అలయ అర్చకుడు పురాణం శ్రీనివాసశర్మ ఆద్వర్యంలో ప్రత్యేకమైన పుజ్యదికార్యక్రమాలు నిర్వహించి ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టతను భక్తులకు తెలియపరిచి, పడమట నర్సాపురం ఆలయ కమిటీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మరియు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో భక్తులకు తీర్ధప్రసాదాలు అందించారు. వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పడమట నర్సాపురంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఉత్తరద్వార దర్శనం చేసుకొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంఘం లక్ష్మీ కుమారి, కాజా రమేష్,ఆళ్ల శ్రీనివాసరావు,దొప్పలపుడి సాంబశివరావు, లేళ్ల గోపాల్ రెడ్డి, బాధావత్ హరీష్, సంఘం నాగరాజు,బిక్షపతి,మల్లిఖార్జున రావు, మరియు భక్తులు పాల్గొన్నారు.


