మాతృభాషను ప్రోత్సహించాలి
భారత్ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి
స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి ముందుకురావాలి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా
కాకతీయ, నేషనల్ డెస్క్ : స్వదేశీ వస్తువులకు, మాతృభాషకు ఉన్న ఔన్నత్యాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి నొక్కిచెప్పారు. ప్రజలు స్వదేశీ వస్తువులను ఉపయోగించాలని, అలాగే ఇంట్లో మాతృభాషలోనే మాట్లాడాలని కోరారు. మనం ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే, ఆత్మనిర్భర్ ఏకైక మార్గమని అన్నారు. అయితే దాన్ని విజయవంతం చేయాడానికి ఏకైక మార్గం స్వదేశీ తెలిపారు. 2047 నాటికి భారత్ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలని, స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి వ్యాపారులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం రాజస్థాన్ జోధ్‌పుర్‌లో జరిగిన మహేశ్వరి గ్లోబల్ కన్వెన్షన్‌లో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా అమిత్ షా ఒక స్టాంపును కూడా విడుదల చేశారు. అందరం ఐక్యతతో ముందుకు నడవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ రాష్ట్ర పురోగతికి సమాజం చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపారు. భారత్ పెద్ద ఎత్తున జరిగే సామాజిక వర్గాల సమావేశాలు దేశాన్ని విడదీయవని, పైగా అవి దేశాన్ని మరింత బలోపేతం చేస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అన్ని వర్గాలు స్వయం సమృద్ధి సాధించినప్పుడే దేశ స్వావలంబన సాధ్యమని అన్నారు.


