కాకతీయ, బయ్యారం: మండలంలోని గంధంపల్లి, కొత్తపేట ఉమ్మడి గ్రామపంచాయతీలో గ్రామ అధ్యక్షుడు కారుబోతుల రామ్మూర్తి అధ్యక్షతన ఇందిరాగాంధీ సెంటర్ లో ఇల్లందు శాసనసభ్యుడు కోరం కనకయ్య జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ నాయక్ కేక్ కట్ చేశారు. అనంతరం ఇందిరా గాంధీ విగ్రహం వద్ద మొక్కలు నాటారు.
మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మాజీ ఎంపీటీసీ సనప సోమేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ జూకంటి సీతారాం రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్ రెడ్డి, మాజీ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.


