పలువురు మృతులకు ఎమ్మెల్యే నివాళులు
కాకతీయ, నెల్లికుదురు / ఇనుగుర్తి : మానుకోట జిల్లాలోని నెల్లికుదురు కు చెందిన ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు గుండెపాక ఉప్పలయ్య ఇటీవల కన్నుమూయడంతో ఎమ్మెల్యే మురళి నాయక్ ఆదివారం ఆయన ఇంటికి వెళ్లి ఉప్పలయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం కావటి లింగమ్మకు,శ్రీరామగిరిలో గొల్లపల్లి కొమరుమల్లు గౌడ్ ల కు నివాళులర్పించారు. ఇనుగుర్తి మండలం ముప్పారంలో కాంగ్రెస్ నేత మాజీ సర్పంచ్ చీనూరి రవి అనారోగ్యంతో కన్ను మూయగా నివాళులర్పించి కుటుంబ సభ్యులు లను పరామర్శించి ఓదార్చే ప్రయత్నం చేశారు.ఎమ్మెల్యే వెంట ఆ పార్టీ నాయకులు సత్యపాల్ రెడ్డి,ఆకుతోట సతీష్,మద్ధి రాజేష్,క్రాంతి రెడ్డి,కొప్పు శ్రీను,కూరెల్లి సతీష్,కదిరె జగన్ తదితరులు ఉన్నారు. అంతకుమునుపు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎదెల్ల యాదవ రెడ్డి, హెచ్ వెంకటేశ్వర్లు వలబోజు వెంకటేశ్వర్లు తదితరులు సంబంధిత మృతులకు నివాళులు అర్పించారు.


