epaper
Sunday, March 1, 2026
epaper

మేడారం మహా జాతర ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

మేడారం మహా జాతర ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష
మేడారంలో నలుగురు మంత్రుల పర్యటన
భక్తుల సౌకర్యాల కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు
220 కోట్లతో జాతర పనులు ఊపందుకున్నాయి
ఓకే వేదికపై కొండ సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

కాకతీయ, ములుగు ప్రతినిధి: ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసి జాతరగా పిలవబడుతున్న తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర 2026 ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రులు గృహ నిర్మాణం మరియు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, దేవాదాయ మరియు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వడ్లూరి లక్ష్మణ్ అన్ని శాఖల అధికారులతో బుధవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు విభిన్న శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేయగా జాతర ఏర్పాట్ల పురోగతి పై ఈ సమీక్ష సమావేశం కీలకం కానుంది.

కోటికి పైగా భక్తుల రాకకు సిద్ధమవుతున్న మేడారం…

రాబోయే సంవత్సరం జనవరి 28 నుండి 31 వరకు జరగబోయే మేడారం మహా జాతరకు ఈసారి కోటి యాభై లక్షల మంది భక్తులు తరలివస్తారని జిల్లా యంత్రాంగం అంచనా వేస్తోంది. భారీగా భక్తులు రావడంతో రహదారులు, పార్కింగ్ స్థలాలు, తాగునీరు, విద్యుత్, శానిటేషన్, వైద్య సదుపాయాలు వంటి ఏర్పాట్లను విస్తృత స్థాయిలో చేపడుతున్నారు.

220 కోట్లతో భారీ అభివృద్ధి పనులు…

మేడారం మహాజాతర 2026 దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం తొలుత 150 కోట్ల రూపాయలు కేటాయించగా, తరువాత మేడారం వనదేవతల ఆలయా ప్రాంతాన్ని మరింత విస్తరించి అందంగా తీర్చిదిద్దే పనుల కోసం అదనంగా 70 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ వివరాలను ఈ నెల 13న జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. అమ్మల గద్దెల పరిసర ప్రాంతాల విస్తరణ, కొత్త రోడ్లు, తాత్కాలిక వసతిగృహాలు, పార్కింగ్ స్థలాలు, సీసీ కెమెరాలు, వైద్యశిబిరాలు, మురుగు నీటి పారుదల వ్యవస్థలు వంటి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

80 రోజులలో పూర్తి చేయాలని లక్ష్యం…..

రాష్ట్ర ప్రభుత్వం మహా జాతర పనులను వచ్చే 90 రోజులలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. జాతర ప్రాంతం చుట్టుపక్కల మౌలిక వసతులను శాశ్వతంగా అభివృద్ధి చేయాలని కూడా మంత్రులు నిర్ణయించారు. ఈ సమావేశంలో అధికారులు శాఖ వారీగా చేపట్టిన పనుల పురోగతిని, జాతర సమయం ఇంకా 80 రోజులే ఉన్నందున సమయంలో పనులు ఎలా పూర్తి చేయాలని అంశంపై అధికారులకు ఆయా శాఖ మంత్రులు దిశా నిర్దేశం చేయనున్నారు.

ప్రజల అంచనాలకు తగ్గ ఏర్పాట్లు….

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి లక్షలాది భక్తులను ఆకర్షిస్తుంది.ఈసారి మహా జాతర నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత సమగ్ర సన్నాహకాలు, భక్తులకు సౌకర్యాలు కల్పించడం ద్వారా మేడారం జాతరను మరింత వైభవంగా నిర్వహించాలని సంకల్పించింది. ఇందుకోసం కావలసిన నిధులను ఇప్పటికే మంజూరు చేసి అభివృద్ధి పనులను ప్రారంభించింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

ఓబీసీ సాధనమే మా లక్ష్యం..!

ఓబీసీ సాధనమే మా లక్ష్యం..! ఆరె కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలి చట్టసభల్లో ప్రాతినిధ్యం...

మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్..!

మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్..! శాశ్వత నిర్మాణాలకు ప్రాధాన్యం జంపన్న వాగులో ఏడాది పొడవునా...

సమత హై స్కూల్‌లో విజ్ఞాన విహారం

సమత హై స్కూల్‌లో విజ్ఞాన విహారం ప్రత్యేక ఆకర్షణగా చంద్రయాన్, హైడ్రాలిక్ లిఫ్ట్...

శాంతియుతంగా కొమ్మాల జాతరను విజయవంతం చేయాలి

శాంతియుతంగా కొమ్మాల జాతరను విజయవంతం చేయాలి.... *రాజకీయ పార్టీ నాయకుల సమీక్ష సమావేశంలో...

ఘనంగా సైన్స్ దినోత్సవం

ఘనంగా సైన్స్ దినోత్సవం కాకతీయ, గీసుగొండ: సైన్స్‌తోనే ఉజ్వల భవిష్యత్తు ముడిపడి ఉందని...

జీవన విధానాన్ని మార్చేసిన సైన్స్‌

జీవన విధానాన్ని మార్చేసిన సైన్స్‌ కాకతీయ, నెక్కొండ: ఆధునిక యుగంలో శాస్త్ర విజ్ఞానం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img