కాకతీయ, తుంగతుర్తి : రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేదల పక్షాన నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు జాజుల వీరయ్య అన్నారు. నాగారం మండలం డీ.కొత్తపల్లి గ్రామానికి చెందిన యలమకంటి వెంకటేష్ కొన్నిరోజుల క్రితం కాలు విరగగా ఇంటి వద్ద కోలుకుంటున్నాడు. కాగా ఖర్చుల నిమిత్తం రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అందజేసిన రూ.40వేల చెక్ ను బాధితుడు వెంకటేష్ కు జాజుల వీరయ్య శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దేవరకొండ మల్లయ్య, కన్నెబోయిన అంజయ్య, కొండం వెంకటేశ్వర్లు, పడిశాల నగేష్, అనంతోజు రవి, దందోలు ప్రవీణ్, దందోలు మహేష్, పడిశాల రవి, యలమకంటి హన్మంత్ తదితరులు పాల్గొన్నారు.


