ఛాంబర్ కార్యవర్గాన్ని అభినందించిన..మంత్రి తుమ్మల
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఛాంబర్ ఆఫ్ కామర్స్ ,ఖమ్మం కు నూతనంగా ఎన్నికైన ప్రధాన కార్యదర్శి సోమ నర్సింహారావు (జి. వై నరేష్ ), ఉపాధ్యక్షుడు బత్తిన నర్సింహారావు (బి ఎన్), కోశాధికారి తల్లాడ రమేష్ లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి చాంబర్ కొత్త కార్యవర్గాన్ని అభినందిస్తూ, ఖమ్మం వ్యాపారాభివృద్ధికి ,వాణిజ్య రంగాల అభివృద్ధికి ఛాంబర్ కీలకపాత్ర పోషిస్తుందని, కొత్తగా ఎన్నికైన పాలక వర్గ సభ్యులు మరింత సేవాభావంతో పని చేసి వ్యాపార వర్గాల సమస్యలు పరిష్కరించడంలో ముందుండాలని సూచించారు. నూతన పాలక వర్గ సభ్యులు తమను ఆశీర్వదించిన మంత్రి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో వ్యాపార వేత్తల కోసం పారదర్శకతతో, నిబద్ధతతో పని చేస్తామని వారు హామీ ఇచ్చారు.


