ముదిరాజ్ల విద్యాభివృద్ధికి మెపా కృషి
చేర్యాల మండల అధ్యక్షుడిగా చింతల పర్శరాములు
కాకతీయ, చేర్యాల : రాష్ట్రంలో ముదిరాజ్లు వెనుకబడి ఉండడానికి ప్రధాన కారణం నిరక్షరాస్యతేనని, వారి విద్యాభివృద్ధి కోసం ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (మెపా) నిరంతరం కృషి చేస్తోందని మెపా చేర్యాల మండల అధ్యక్షులు చింతల పర్శరాములు ముదిరాజ్ తెలిపారు. మంగళవారం మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ చేతుల మీదుగా పర్శరాములు నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముదిరాజ్ కులస్తుల విద్యా, ఉద్యోగాభివృద్ధికి మెపా ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. మండలంలోని ముదిరాజ్ల ఐక్యత కోసం కృషి చేస్తూ, రిజర్వేషన్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేలా ఉద్యమాలు కొనసాగిస్తామని తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు పిట్ల ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి నాయిని కృష్ణ సహకారాన్ని గుర్తుచేశారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పర్శరాములను ముదిరాజ్ సంఘ నాయకులు ఘనంగా సత్కరించారు.


