విజయ నర్సింగ్ హోంను తనిఖీ చేసిన వైద్యాధికారి
కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని విజయ నర్సింగ్ హోమ్ ను గురువారం
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా ఆయన పలు సూచనలు చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందించే సేవల ప్రైస్ లిస్ట్ ను రిసెప్షన్ వద్ద స్పష్టంగా ప్రదర్శించాలని పేర్కొన్నారు. ల్యాబ్‌లో నిర్వహించే రక్తపరీక్షల ధరల జాబితా కూడా రిసెప్షన్ వద్ద ఉంచాలని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ల పేర్లను కూడా స్పష్టంగా ప్రదర్శించాలని, వాడే వైల్స్ మూత తొలగించిన వెంటనే వాటిపై తేదీ సమయం తప్పనిసరిగా నమోదు చేయాలని తెలిపారు. కాన్పులు నిర్వహించే గదులను శుభ్రంగా ఉంచి అవసరమైన మందులను తగిన విధంగా నిల్వ చేయాలని స్పష్టం చేశారు. ఆసుపత్రి నిర్వహణలో కనుగొన్న అసమానతలు మరల పునరావృతం కాకూడదని డాక్టర్ తుకారం రాథోడ్ హెచ్చరించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో
డివైపిఎంఓ మోహన్ పాల్గొన్నారు.


