మల్లన్న ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి
కత్తెరశాల ఆలయ అభివృద్ధికి కృషి
రూ. 20 లక్షల నిధులు మంజూరు
రహదారి కోసం ఫారెస్ట్ అనుమతులు తెచ్చేందుకు ప్రయత్నం
మంత్రి గడ్డం వివేక్
వేలాల, కత్తెరశాల మల్లన్న ఆలయాల్లో కుటుంబ సమేతంగా పూజలు
కాకతీయ, రామకృష్ణాపూర్ (చెన్నూరు) : జైపూర్ వేలాల గట్టు మల్లన్న, కత్తెరశాల మల్లన్న ఆశీస్సులు చెన్నూరు నియోజవర్గ ప్రజలందరిపై ఉండాలని చెన్నూరు ఎమ్మెల్యే, కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కోరారు. మహాశివరాత్రి పర్వదిన సందర్బంగా నియోజవర్గంలోని వేలాల, కత్తెరశాల మల్లన్న ఆలయాలను కుటుంబసమేతంగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కాగా పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ పూజారులు మంత్రి వివేక్, సతీమణి సరోజాను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడారు. ఫారెస్ట్ అనుమతులు లేకపోవడంతోనే రహదారి నిర్మాణం పూర్తి కాలేదన్నారు. ఫారెస్ట్ అనుమతులు తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కత్తెరశాల మల్లన్న ఆలయ అభివృద్ధి కోసం రూ. 20 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం చెన్నూరు పట్టణంలో నిర్వహించిన సేవాలాల్ జయంతి ఉత్సవాలలో మంత్రి పాల్గొన్నారు.


