- ఖమ్మం సీపీ సునీల్ దత్
- పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆయుధ పూజ
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని పోలీసు కమిషనర్ సునీల్ దత్ ఆకాంక్షించారు. గురువారం జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు కమిషనర్ ఆయుధ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ… విజయాన్ని చేకూర్చే విజయదశమి పర్వదినాని పురస్కారించుకొని జిల్లాలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు.
పోలీసుల గౌరవం, కీర్తిప్రతిష్టలు పెంపొందించాలని ఆకాంక్షించారు. శక్తికి ప్రతీకగా నిలిచే దుర్గామాత సమక్షంలో ప్రతి ఆయుధానికి ఎంతో శక్తి కలిగి ఉంటుందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (ఆడ్మీన్) రామానుజం, అడిషనల్ డీసీపి (ఏఆర్) కుమారస్వామి, ఎస్బి ఏసిపి మహేష్, ఏ ఆర్ ఏ సి పి సుశీల్ సింగ్, ఆర్ ఐ లు కామరాజు, శ్రీశైలం, సురేష్, సాంబశివరావు,నాగుల్ మీరా, సిఐ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


