epaper
Sunday, March 1, 2026
epaper

ఇది ధైర్యవంతుల నేల.. మీ వెంటే నేను.. మణిపూర్ హింస బాధితులతో ప్రధాని మోదీ..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్‌లోని చురచంద్‌పూర్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మణిపూర్ స్ఫూర్తికి వందనం. మీ ప్రేమను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ రాష్ట్రం ఈశాన్యానికి ప్రకాశాన్ని జోడించే రత్నం అని అన్నారు. గతంలో హింస మణిపూర్‌ను కుదిపివేయడం బాధాకరమని, అయితే ఇప్పుడు ఆశ, విశ్వాసాల కొత్త ఉదయం ప్రారంభమవుతోందని తెలిపారు. కుకీలు, మెయిటీల మధ్య చర్చలు సాగుతున్నాయని, ప్రజలు శాంతి మార్గం వైపు అడుగులు వేస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు.

మణిపూర్ ప్రజలతో నేను ఉన్నాను. భారత ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. నిర్వాసితుల కోసం రూ.500 కోట్ల ప్యాకేజ్ కేటాయించాం. మణిపూర్ అభివృద్ధి తిరిగి సరైన దారిలో పయనించేలా నేను కృషి చేస్తాను అని ప్రధాని హామీ ఇచ్చారు. ఈ సందర్శనలో భాగంగా ప్రధాని మోదీ దాదాపు రూ.7 వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులు కొండ ప్రాంతాలు, గిరిజన సమాజం సహా మణిపూర్ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని ఆయన పేర్కొన్నారు.

మణిపూర్ ఎప్పటినుంచో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కనెక్టివిటీ అని మోదీ గుర్తుచేశారు. గతంతో పోలిస్తే రైలు, రోడ్ల బడ్జెట్‌ను అనేక రెట్లు పెంచినట్లు చెప్పారు. వందలాది గ్రామాలకు రోడ్లు కల్పించారని, జిరిబామ్–ఇంఫాల్ రైల్వే లైన్ పూర్తయ్యాక రాజధాని ఇంఫాల్ దేశ రైల్వే నెట్‌వర్క్‌తో కలుస్తుందని తెలిపారు. కొండలు, లోయలలోని వివిధ సమూహాలతో ఇటీవల జరిగిన చర్చలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయని ప్రధాని అన్నారు. సంభాషణ, పరస్పర గౌరవం, అవగాహనలతో శాంతి సాధ్యమని, అందరూ శాంతి మార్గంలో నడవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మణిపూర్‌లో ఉపాధి అవకాశాలు పెంచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని ప్రధాని తెలిపారు. గతంలో ఢిల్లీ నుంచి ప్రకటనలు మణిపూర్‌కి చేరుకోవడానికి దశాబ్దాలు పట్టేవి. ఇప్పుడు రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోంది. భారత్ త్వరలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది అని అన్నారు. దేశవ్యాప్తంగా పేదలకు ఇళ్లు నిర్మించే పథకం కింద మణిపూర్‌లో కూడా వేలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని చెప్పారు. 7–8 సంవత్సరాల క్రితం వరకు 25–30 వేల ఇళ్లకే పైపుల ద్వారా నీరు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం 3.5 లక్షల ఇళ్లకు పైపుల నీటి సౌకర్యం కల్పించామని వివరించారు.

కొండ ప్రాంతాల్లో ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు కల అనిపించేవని ప్రధాని గుర్తుచేశారు. అయితే చురచంద్‌పూర్‌లో కొత్తగా వైద్య కళాశాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే పిఎం-దేవైన్ పథకం కింద ఐదు కొండ జిల్లాల్లో ఆధునిక ఆరోగ్య సేవలను అభివృద్ధి చేస్తున్నామని, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఒక్క మణిపూర్‌లోనే 2.5 లక్షల రోగులు ఉచిత చికిత్స పొందారని వివరించారు. మొత్తం మీద ప్రధాని మోదీ ప్రసంగంలో మణిపూర్ అభివృద్ధి, శాంతి, ఉపాధి, ఆరోగ్య సదుపాయాలపై స్పష్టమైన దిశను సూచించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీ.. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీసెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలుడీఎస్పీ రవీందర్...

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం కాకతీయ, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల...

రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు – కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు

45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు… కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు కాక‌తీయ‌, తెలంగాణ...

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌ కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్...

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి అస్వస్థత – నిమ్స్‌లో చికిత్స

బిగ్ బ్రేకింగ్‌..! మాజీ మంత్రి జీవన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత ఇటీవల రాజకీయ పరిణామాలతో...

ఖమ్మం నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం – విద్యార్థిపై దాడి

నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం మత్తులో ఇద్దరు విద్యార్థుల దాడి… ఇంటర్ విద్యార్థి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img