ఆశ వర్కర్ల సమస్యలపై చలో రాజధాని సభను జయప్రదం చేయండి
సిఐటియు మండల కార్యదర్శి బాదావత్ శీను నాయక్
*కాకతీయ,కామేపల్లి :కామేపల్లి మండల పరిధిలోని 24 గ్రామపంచాయతీలో పనిచేస్తున్న ఆశ వర్కర్ల సమస్యలను తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని, కోరుతూ చలో హైదరాబాద్ రాజధాని నగరంలో జరిగే సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ వర్కర్ల మహాసభను జయప్రదం చేయాలని కదం తొక్కుతూ దండుగా కదిలిన కామేపల్లి మండలం ఆశ వర్కర్లు వినతి పత్రాన్నికామేపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి (పీ హెచ్ సి) డాక్టర్ చందనకి అందించడం జరిగింది.
ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి బాదావత్ శ్రీను మాట్లాడుతూ ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం సకాలంలో అందించడంలో జాప్యం జరుగుతుందని సకాలంలో వారి వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలని కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23వ తేదీన చలో హైదరాబాద్ రాజధాని నగరంలోని జరిగే మహా బహిరంగ సభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వేలాదిమంది తరలి రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కోర్ర నీల హాట్కర్ బుజ్జి సుమతి తదితరులు పాల్గొన్నారు.


