- సింగరేణి జీఎం (పర్సనల్) వెల్ఫేర్ కిరణ్ కుమార్
కాకతీయ, కొత్తగూడెం రూరల్: ఈనెల 27న ప్రకాశం స్టేడియంలో జరిగే బతుకమ్మ ప్రధాన వేడుకలు, ఫ్యామిలీ డే కార్యక్రమానికి వచ్చే ఆడపడుచులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలని జీఎం(పర్సనల్) వెల్ఫేర్ అండ్ సీఎస్‌ఆర్ జి.వి.కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
బుధవారం ఆయన ఏర్పాట్ల నిర్వహణపై అధికారులతో మాట్లాడారు. తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన బతుకమ్మను పురస్కరించుకొని 25న సింగరేణి ప్రధాన కార్యాలయంలో, 27న కార్పొరేట్ ఏరియా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియం నందు బతుకమ్మ ప్రధాన వేడుకలు ఫ్యామిలీ డే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రధాన వేడుకలలో మహిళలు తెచ్చిన బతుకమ్మలలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు.
బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుటకు తగిన ఏర్పాట్లు చేయాలని సెక్యూరిటి, సివిల్, ఎలక్ట్రికల్, ట్రాన్స్ పోర్ట్, పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిజిఎం(ఈ అండ్ఎం) మెయిన్ వర్క్ షాప్ పి.రాజీవ్ కుమార్, డిజిఎం(పర్సనల్)లు బి.శివ కేశవరావు, ముకుంద సత్యనారాయణ, డివైసిఎంఓ కాళేశ్వరరావు, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ జాకీర్ హుస్సైన్, ఎస్‌ఈ(ఈ అండ్ఎం) ఆర్.వి.రామ శేషయ్య, ఏఈ(సివిల్)ఎస్.కరుణాకర రెడ్డి, జూనియర్ ఇన్స్పెక్టర్ డి.నారాయణ రెడ్డి, వెల్ఫేర్ పిఏ కే.వరప్రసాద రావు, స్పోర్ట్స్ సూపర్ వైజర్ ఎంసి పోస్ నెట్ తదితరులు పాల్గొన్నారు.


