epaper
Saturday, November 15, 2025
epaper

పోడు భూముల్లో మళ్లీ లొల్లి

  • ట్రెంచ్ పనులు ఆపాలని జేసీబీని అడ్డుకున్న గిరిజనులు
  • పోడు భూముల్లో ఉద్రిక్తత వాతావరణం

కాకతీయ, పినపాక : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో మల్లీ పోడు భూముల లొల్లి మొదలైంది. నియోజకవర్గంలోని బోటుగూడెం గ్రామపంచాయతీ బందగిరి నగరంలో పోడు భూముల వ్యవహారం అటవీ శాఖ అధికారులు పోడుదారుల మధ్య వివాదంగా మారింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలన కంటే ముందు నుండే ఈ భూములను తాము సాగు చేసుకుంటున్నామని పోడు రైతులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఆ భూముల్లో పంటలు కూడా వేశామని, అయినా ఫారెస్ట్ అధికారులు ట్రెంచ్ పేరుతో అడ్డుకున్నారని పోడుదారులు ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో అంతరించి పోతున్న అడవులను సంరక్షించాలని అటవీశాఖలో కొత్తగా వచ్చిన అధికారులు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా తమ క్లస్టర్ పరిధిలో సరిహద్దులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారన్నారు. అయితే పినపాక మండల వ్యాప్తంగా చాలా చోట్ల వందలాది ఎకరాల్లో రైతు పోడు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటవీ శాఖ అధికారులు తమ పరిధిలోని భూములు సాగు చేయొద్దని పోడుదారులను ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడంతో ఈ వివాదాలు తలెత్తుతున్నాయి.

ప్రజాప్రతినిధుల మాట బేఖాతరు..
ఇటీవల జిల్లాలో పర్యటించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పోడు రైతులను ఇబ్బంది పెట్టొద్దని అటవీ అధికారులకు చెప్పారు. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదని పోడుదారులు వాపోయారు. పోడు భూముల్లో నిర్వహిస్తున్న ట్రెంచ్ పనులను స్థానిక గిరిజన రైతులు అడ్డుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే పాయం చెప్పిన ఆయన ఆదేశాలు పట్టించుకోకుండా పనులు చేస్తున్నారంటూ జేసీబీ ముందు గిరిజనులు పడుకున్నారు. దీంతో గిరిజన రైతులను పోడు భూముల్లోనుంచి అటవీశాఖ అధికారులు గిరిజనులను తప్పుకోవాలని చెప్పడంతో ఉద్రిక్తతకు దారితీసింది. అధికారుల తీరుతో గిరిజన రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమిని వదిలే ప్రసక్తి లేదని గిరిజన రైతులు భీష్మించుకున్నారు.

పోడు రైతులకు అండగా ఉంటాం: సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న
పోడు రైతులకు అండగా ఉంటామని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న అన్నారు. బుధవారం ట్రెంచ్ కొడుతున్న బండగిరి నగరం చేరుకొని అక్కడ గిరిజన సమస్యలు తెలుసుకున్నారు. అసెంబ్లీలో రైతులకు అండగా ఉంటామని, పోడు చేసుకున్న వారికి పట్టాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే.. అధికారులు రైతుల మీద పీడీ చట్టాలతో కేసులు పెడుతున్నారని అన్నారు. సాగులో ఉన్న భూముల్లో ఈ పనులు ఏమిటని ఆయన ప్రశ్నించారు. కొత్త భూమి నరికితే అది గిరిజనులదైనా తప్పే అన్నారు. కానీ పాత భూములు ట్రంచ్ కొట్టడం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే పనులు నిలిపివేయకపోతే మరో ఉద్యమానికైనా సిద్ధమన్నారు. స్థానిక అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేశామని అయినా ఇలా గిరిజన భూముల్లో పనులు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

ఎమ్మెల్యేతో మాట్లాడాం, సమస్యను పరిష్కరిస్తాం: కాంగ్రెస్ నాయకుడు బండారు సాంబ
పోడు రైతుల సమస్య తెలియగానే బందగిరి నగరానికి చేరుకుని, తక్షణమే పినపాక శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లుతో మాట్లాడామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బండారు సాంబ తెలిపారు. గిరిజన సమస్యలపై కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉందని, తక్షణమే ట్రంచ్ పనులు నిలిపివేయాలని ఎమ్మెల్యే అటవీ శాఖ అధికారులకు తెలిపినట్లుగా సాంబ తెలిపారు. పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించిన తర్వాత అటవీ శాఖ భూములు ఉంటే వారికి అందిస్తామని సైతం తెలిపారు. కానీ ఎంతో కాలంగా పోడు సాగు చేసుకుంటున్న భూములపై దౌర్జన్యం వద్దని అన్నారు.

ఫారెస్ట్ హద్దులు దాటి ట్రంచ్ పనులు నిర్వహించడం లేదని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్విని, డీడిఆర్ఓ అరుణ తెలిపారు. బందగిరి నగరంలో ఎంతోకాలంగా సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో ట్రంచ్ పనులు చేస్తున్నామన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. గిరిజనుల ఆవేదన అర్థం చేసుకొని రెండు రోజులు ట్రంచ్ పనులు నిలిపివేస్తున్నామని తెలిపారు. జిపిఎస్ మ్యాప్ పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఫారెస్ట్ భూములను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఎవరి భూములు ఉద్దేశపూర్వకంగా లాక్కోవడం లేదని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి హక్కు అని తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..??

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..?? ద‌ర్యాప్తు ఎందుకు ముందుకు సాగ‌డం లేదు..? ర‌క్త‌చ‌రిత్ర‌లో రాజ‌కీయ కోణంపై...

ఎన్ డి ఎ కూటమి విజయం

ఎన్ డి ఎ కూటమి విజయం హర్షం వ్యక్తం చేసిన బీజేపీ మండల...

యువతలో కొత్త జాగృతి ప్రేరణనే చైతన్యం

యువతలో కొత్త జాగృతి ప్రేరణనే చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం ముగింపు ర్యాలీ ప్రజల...

భళారే.. యమ

భళారే.. యమ పిల్లల పండుగ రోజున అలరించిన బుడతడు కాకతీయ కొత్తగూడెం రూరల్: బాలల...

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల పంట…

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల పంట... రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్, సహకార, చేనేత...

కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం

కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం కాకతీయ,ఖమ్మం ప్రతినిధి: జిల్లా కాంగ్రెస్ నాయకుడు,...

టీబీ వ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి

టీబీ వ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి డాక్టర్ దుర్గాభవాని కాకతీయ, పినపాక:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img