లోక్ అదాలత్ ను వినియోగించుకోవాలి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పాటిల్ వసంత్
కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్ట్ లో ఈనెల 21వ తేదీన జరిగే లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పాటిల్ వసంత్ తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్‌తో కలిసి గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కేసులు ఉన్నట్లైతే వాటిని(కాంప్రమైజ్) రాజీ చేసుకోవచ్చని అన్నారు. కక్షిదారులు తమ కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవడం వలన సమయం డబ్బు అదా అవుతుందని అన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారం కొరకై ఈ లోక్ అదాలత్ ను నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున అత్యధిక కేసులను పరిష్కరించడానికి పోలీసు అధికారులు న్యాయవాదులు కోర్టు సిబ్బంది కృషి చేయాలని తెలిపారు. యాక్సిడెంట్, సివిల్ చీటింగ్, చిట్ పన్డ్, భూతగాదాలకు సంబంధించిన కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. వివాహ బంధానికి సంబంధించిన, చిన్నచిన్న దొంగతనం కేసులు, ట్రాఫిక్ చాలాన్, డ్రంక్ అండ్ డ్రైవ్, కుటుంబ తగాదాలు, బ్యాంకు లావాదేవీల కేసులు, టెలిఫోన్ బకాయిల కేసులతో పాటు తదితర కేసులను ఈ లోకదాలత్ లో రాజీ చేసుకుని కేసును పూర్తిగా క్లోజ్ చేసుకునే అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.


