epaper
Monday, March 2, 2026
epaper

దేవాదాయ శాఖ స్థలంలో లిక్కర్ మార్ట్

దేవాదాయ శాఖ స్థలంలో లిక్కర్ మార్ట్
నవరాత్రులు జరిగే ప్రాంతంలో ఏర్పాటు
ఎలాంటి అనుమతులు లేకుండానే షెడ్డు నిర్మాణం
ఇంటి నెంబర్ రాకుండానే కరెంటు మీటర్
ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అత్యుత్సాహం
మరో రెండు మూడురోజుల్లో లైసెన్స్‌ వచ్చే అవకాశం    
ఉన్నతాధికారులకు ఫిర్యాదులందినా డోంట్ కేర్
స్థానిక కార్పొరేటర్ చెప్పిన వినిపించుకోని వైనం

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం నగరం 41వ డివిజన్ జమ్మి బండ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ భూమిలో లిక్కర్ మార్ట్ ఏర్పాటు సర్వం సిద్ధమైంది. ప్రతి సంవత్సరం జరిగే దసరా నవరాత్రులు చివరి రోజు జరిగే పాలపిట్ట దర్శనానికి ప్రసిద్ధి చెందిన జమ్మి బండ పక్కన నిర్మాణం చేపట్టడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. లిక్కర్ మార్ట్ ఏర్పాటు కోసం ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ అధికారులు అనుమతులు ఇవ్వడ‌మేంట‌ని స్తంభాద్రి ఉత్సవ కమిటీ భక్త బృందం పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎన్నో ఏళ్ల ఖమ్మం చరిత్రకు తలమానికంగా నిలిచిన జమ్మిబండ పుణ్యక్షేత్రం పక్కన లిక్కర్ మార్ట్ నిర్మించడంపై స్థానిక కార్పొరేటర్ కర్నాటి కృష్ణ దేవాదాయ శాఖ అధికారులకు, కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ లిక్కర్ మార్ట్ నిర్మాణం ప్రధాన రహదారి చేపట్టడం పక్కనే ఉన్న దేవాలయానికి ఆ పక్కన ఉన్న విద్యాసంస్థలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికే నిర్మించిన షెడ్డు కు ఇంటి నెంబర్ లేకుండానే కరెంటు మీటర్ ఇవ్వడం పట్ల విద్యుత్ శాఖ అధికారులపై కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి.

అధికారం అండ‌దండ‌లు ఉంటే అంతేనా..?!

కార్పొరేషన్ నుంచి తీసుకోవాల్సిన ఎలాంటి అనుమతులు తీసుకోకపోగా, చకచకా పనులు జరగడం వెనక అధికార పార్టీకి చెందిన కీలక నేత ఉన్నట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. అధికారం ఉంటే ఏదైనా చేయడం సులభతరమని ఈ లిక్కర్ మార్ట్ నిర్మాణం వ్య‌వ‌హార‌మే స్ప‌ష్టం చేస్తోంద‌ని ప్రజలు మండిప‌డుతున్నారు. మరో రెండు మూడు రోజుల్లో ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ నుంచి లైసెన్స్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. స్థానిక కార్పొరేటర్ చెప్పిన వినిపించుకోకుండా తమతైన శైలిలో లిక్కర్ మార్ట్ యజమాని కొంతమంది స్థానిక నేతల సహకారంతో ఈ నిర్మాణం చేపడుతున్నట్లు విమర్శలు వెలువెత్తుతున్నాయి. జమ్మి బండకు ఆనుకుని ఉన్న స్థలం ఓ ప్రైవేటు వ్యక్తిదని తప్పుడు ప్రచారం చేస్తూ కోర్టు పరిధిలో ఉన్న స్థలంలో నిర్మాణం చేపట్టడం వెనక అనుమానాలు కూడా వ్య‌క్త‌మ‌వుతుండ‌టం గ‌మానార్హం.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img