సీనియర్ అకౌంటెంట్‌గా లెనిన్ కుమార్ ఎంపిక
మూడు ప్రభుత్వ నియామక పరీక్షల్లో ఉత్తీర్ణత
కాకతీయ, ఖమ్మం : ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన గడ్డిమీది లెనిన్ కుమార్ మరో ఘనత సాధించారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గ్రూప్–3 ఫలితాల్లో ఆయన సీనియర్ అకౌంటెంట్‌గా ఎంపికయ్యారు. లెనిన్ కుమార్ ప్రస్తుతం గ్రూప్–4 ద్వారా ఎంపికై జూనియర్ అకౌంటెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అంతకు ముందు కారేపల్లిలో ఫారెస్ట్ బీట్ అధికారిగా పనిచేశారు. ఫారెస్ట్ బీట్ అధికారి, గ్రూప్–4 జూనియర్ అకౌంటెంట్‌గా ఇప్పటికే రెండు ప్రభుత్వ నియామక పరీక్షల్లో విజయం సాధించిన ఆయన, తాజాగా గ్రూప్–3 ఫలితాల్లోనూ ఉత్తీర్ణత సాధించి సీనియర్ అకౌంటెంట్‌గా ఎంపిక కావడం విశేషంగా నిలిచింది. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి నిరంతర కృషితో వరుసగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడంపై స్థానికులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ లెనిన్ కుమార్‌ను అభినందిస్తున్నారు. ఆయన విజయం యువతకు ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు


