కల్వకుంట్ల కవితను కలిసిన నాయకులు
కాకతీయ, ఖమ్మం : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈనెల 18న ఖమ్మం జిల్లా లో పర్యటంచనున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో వివిధ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి జిల్లా విద్యావంతులను, మేధావులతో కలిసి జిల్లా విషయాలు తెలుసుకొనుట కొరకు ఖమ్మం రానున్నారు. ఈ మేరకు తెలంగాణ ఆదివాసి జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు లోకి రాజు, జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కవిత అనేక పోరాటాలు చేశారన్నారు. తెలంగాణ ఆదివాసీ, ఎరుకుల కులస్తులకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో మీకు తోడుగా ఉంటానని హామీ ఇచ్చారన్నారు. కవిత నాయకత్వంలో పనిచేయుటకు తెలంగాణ ఆదివాసీ జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు, తెలంగాణ ఆదివాసీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి కృష్ణను ఇటీవల హైదరాబాద్ జాగృతి రాష్ట్ర కార్యాలయంలో నియమిస్తున్నట్టు కవిత ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలికి పాలకుర్తి కృష్ణ ధన్యవాదాలు తెలిపారు.


