వున్నo బ్రహ్మయ్యని పరామర్శించిన కేటీఆర్, కందాళ
కాకతీయ , కూసుమంచి : నేలకొండపల్లి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వున్నo బ్రహ్మయ్య మాతృమూర్తి అచ్చమ్మ మంగళవారం అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి బుధవారం బ్రహ్మయ్య నివాసానికి వెళ్ళి అచ్చమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


