పోలింగ్ సరళిని పరిశీలించిన ఖర్తడే
పోలింగ్ కేంద్రాల తనిఖీ
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : పంచాయతీ ఎన్నికలు మొదటి విడత పోలింగ్ సందర్భంగా గురువారం సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీ చరణ్ సుధామా రావు చింతకాని మండలంలోని పందిళ్లపల్లి, జగన్నాధపురం చింతకాని, కొణిజర్ల మండలంలోని పెద్దగోపతి, వైరా మండలంలోని తాటిపూడి, రఘునాధపాలెం మండలంలోని వి. వెంకటాయపాలెం గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీ చరణ్ సుధామా రావు మాట్లాడుతూ ఎన్నికల నిబంధనల ప్రకారం గ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా ఖమ్మం జిల్లాలో జరుగుతున్నాయని, ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి తమ ఓటు హక్కు వినియోగించు కున్నారని తెలిపారు.
పోలింగ్ ముగిసిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ కూడా కట్టుదిట్టంగా నిర్వహణకు అని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గ్రామాలలో వార్డు సభ్యులు, సర్పంచ్ కౌంటింగ్ ముగిసిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ చేపట్టేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు.
ఈ పర్యటనలో మండల తహశీల్దార్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


