- సర్కార్ నిధులు, సీఎస్‌ఆర్ ఫండ్స్ వృథా
- పీడీఎస్‌యూ డిమాండ్
- ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్‌కు వినతి
కాకతీయ, ఖమ్మం : ఖమ్మం జిల్లా కేంద్రంలోని సైన్స్ మ్యూజియం రెండు సంవత్సరాలుగా మూతపడిఉంటోందని, వెంటనే తెరిపించేందుకు చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ ఖమ్మం డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు సాధిక్ పాషా, యశ్వంత్ కుమార్ లు డిమాండ్ చేశారు. శుక్రవారం
విద్యార్థుల ప్రయోగాత్మక బోధన కోసం కొనుగోలు చేసిన పరికరాలు వాడకం లేక తుప్పుపడి పనికిరాకుండా పోతున్నాయని ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారుల పై వారు మండిపడ్డారు .
పీడీఎస్‌యూ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అడిషన్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అడిషన్ కలెక్టర్ స్పందించి జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని గారికి ఫోన్ చేసి తక్షణమే సైన్స్ మ్యూజియం పారంభించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్బంగా పీడీఎస్‌యూ నేతలు మాట్లాడుతూ పాత డీఈవో కార్యాలయంలో 2023 ఆగస్టులోనే పూర్తయిన సైన్స్ మ్యూజియం ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం విద్యాశాఖ నిర్లక్షమేనని అన్నారు. ప్రయోగాత్మక బోధన అందక విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.50 లక్షల ప్రభుత్వ నిధులు, సీఎస్‌ఆర్ ఫండ్స్ (రూ.20 లక్షలు) వృథా అవుతున్నాయని తెలిపారు. రెండు సంవత్సరాలుగా రెగ్యులర్ డీఈవో, డీఎస్‌వోల పేరుతో లేకపోవడాన్ని కారణం చూపుతూ అధికారులు బాధ్యత తప్పించుకోవడం దుర్మాగాం అన్నారు.
ఖమ్మం జిల్లా మొత్తంలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు ఈ మ్యూజియం కీలకం అన్నారు
“సైన్స్ మ్యూజియం వెంటనే ప్రారంభించాలి. ఇక ఆలస్యం విద్యార్థుల భవిష్యత్తును బలి చేస్తోందన్నారు. ఖమ్మం జిల్లా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి” అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో పి డి ఎస్ యూ నాయకులు వినయ్, హరిచంద్ర ప్రసాద్, అశోక్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.


