ఖమ్మం ఫోటోగ్రాఫర్‌కు జాతీయ పురస్కారం
కేయస్ బాబాకు ‘యువ గురు’ అవార్డు ప్రదానం
వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో విశిష్ట సేవలకు గుర్తింపు
కాకతీయ, ఖమ్మం: ఉస్మానియా విశ్వవిద్యాలయం సమర్పణలో ఫోటో పరివార్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్లో ఖమ్మంకు చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ కేయస్ బాబాకు యువ గురు పురస్కారం అందజేశారు. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్‌గా కొనసాగుతూనే ఆయన కేయస్ బాబా ఆర్ట్స్ అకాడమీ స్థాపించి 14 బ్యాచ్‌ల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో 115 మంది ఫోటోగ్రాఫర్లకు వీడియో ఎడిటింగ్ శిక్షణ ఇచ్చారు. హైదరాబాద్ కేబీఆర్ కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమంలో జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ ప్రొఫెసర్ కమల్ రాయ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ విజయంతో ఖమ్మం ఫోటోగ్రాఫర్లు హర్షం వ్యక్తం చేశారు


