అంతర్జాతీయ ప్రమాణాలతో ఖమ్మం నగరాభివృద్ధి
మార్చి నాటికి ట్రంక్ లైన్ పనులను పూర్తి చేయాలి
వరద నీరు నివాసాలను ముంచెత్తకుండా చూడాలి
అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం నగరానికి అంతర్జాతీయ ప్రమాణాలనుగుణంగా సర్వత్రా అభివృద్ధి కల్పించడానికి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి చేస్తున్నారు. ఆదివారం ఖమ్మా మమతా రోడ్డులోని పలు వార్డులను సందర్శించి భూగర్భ మురుగు నీటి పారుదల వ్యవస్థ పనుల పురోగతిని పరిశీలించారు. మంత్రి తెలిపారు, రూ. 90 కోట్లతో భూగర్భ డ్రైనేజ్ ట్రంక్ లైన్ మరియు రెండు మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణం జరుగుతుందని, పదేళ్లపాటు నిర్వహణకు అవసరమైన నిధులు కూడా మంజూరు చేసినట్లు. మార్చి నాటికి ట్రంక్ లైన్ పనులను పూర్తి చేయాలని, వర్షపు నీరు నివాసాలను ముంచెత్తకుండా చూడమని అధికారులు మరియు క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశించారు. ఈ పథకంలో భాగంగా 8.5 కిలోమీటర్లు మురుగు నీటి పైప్లైన్ (ఊర చెరువు నుంచి ధంసలాపురం చెరువు వరకు), అంతర్గత పైప్లైన్ల ద్వారా మురుగునీరు శుద్ధి కేంద్రాలకు తరలింపు
ధంసలాపురం వద్ద 44 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల, పుట్టకోటలో 9.5 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల శుద్ధి కేంద్రాల నిర్మాణం, ముఖ్యంగా వర్షపు నీటి వరదలు, మురుగునీరు కలిసే సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా డ్రైన్ లు మరియు పైప్ లైన్‌లను వేరుగా ఏర్పాటు చేస్తున్నారు.
కార్యక్రమంలో మంత్రి వెంట అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఈఈ వి. రంజిత్, ఇరిగేషన్ ఈఈ అననీయ, మునిసిపల్ కార్పొరేషన్ ఇంచార్జి ఈఈ టి. ధరణికుమార్, పబ్లిక్ హెల్త్ డిఈ కె. నవీన్ కుమార్, ఏఈలు నవ్య జ్యోతి, దివ్య, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


