దశదినకర్మకు హాజరైన కందాళ ఉపేందర్ రెడ్డి
కాకతీయ , కూసుమంచి : తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామం కూసుమంచి మండల మాజీ జెడ్పిటిసి ఇంటూరి బేబీశేఖర్ మాతృమూర్తి నుకారపు వీరమ్మ ఇటీవల మృతి చెందారు. గురువారం దమ్మాయిగూడెం గ్రామంలో జరుగుతున్న దశదినకర్మకు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి హాజరై ఆమె చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గం ముఖ్య నాయకులు స్థానిక నాయకత్వం తదితరులు పాల్గొన్నారు.


