దమ్మున్న పత్రిక కాకతీయ
విశ్వసనీయ వార్తలు.. సంచలన కథనాలకు కేరాఫ్
అనతికాలంలోనే పాఠకుల ఆదరణ అభినందనీయం
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
కాకతీయ నూతన సంవత్సరం క్యాలెండర్ల ఆవిష్కరణ
ప్రజా గొంతుకవుతాం : ఎండీ పేరం గోపీకృష్ణ
ప్రజాపక్షంగా.. ప్రతిపక్షంగా ఉంటాం : ఎడిటర్, అరెల్లి కిరణ్ గౌడ్
కాకతీయ, తెలంగాణ బ్యూరో: విశ్వసనీయ వార్తలు.. సంచలన కథనాలకు కాకతీయ పత్రిక కేరాఫ్‌గా నిలుస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నిత్య నూతనంగా వెలువడుతూ అనతికాలంలోనే అశేష పాఠకుల ఆదరణ పొందడం అభినందనీయమని కొనియాడారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కాకతీయ దినపత్రిక ఆధ్వర్యంలో రూపొందించిన 2026 క్యాలెండర్‌ను బుధవారం హన్మకొండలో మంత్రి ఆవిష్కరించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దమ్మున్న, నిష్పక్షపాత వార్తలు రాయడమేగాక ప్రజా సమస్యలను వెలికి తీస్తోందన్నారు. డిజిటల్ ఫ్లాట్‌ఫాంలో క్షణాల్లో వార్తలను ప్రజలకు చేరవేయడంలో ఎప్పుడూ ముందుంటోందని, పత్రికారంగంలో తక్కువ సమయంలో ప్రత్యేక గుర్తింపు దక్కించుకుందని కొనియాడారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలని, రీడర్స్‌కు ఇంకా దగ్గర కావాలని ఆకాంక్షించారు. ఈసందర్భంగా పత్రిక యాజమాన్యానికి, రిపోర్టర్లు, సిబ్బందికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పత్రిక ఎడిటర్ అరెల్లి కిరణ్ గౌడ్, ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యూరో చీఫ్ ఉమ్మల సందీప్, వరంగల్ రిపోర్టర్ అడుప అశోక్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా గొంతుకవుతాం : ఎండీ పేరం గోపీకృష్ణ
ప్రజల గొంతుకగా ఉత్తరం కాకతీయ దినపత్రిక నిలుస్తోందని.. సమస్యల పరిష్కారమే ఎజెండాగా ముందుకు సాగుతుందని పత్రిక ఎండీ పేరం గోపీకృష్ణ అన్నారు. హన్మకొండలోని పత్రికా కార్యాలయంలో నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు. పత్రికారంగంలో కాకతీయ పత్రిక నూతన ఒరవడితో, తనదైన శైలితో దూసుకుపోతుండటం హర్షణీయం అన్నారు. నిజాన్ని నిర్భయంగా, నిష్పక్షపాతంగా వెలికితీయడమే నైజమని, నికార్సైన జర్నలిజానికి నిలువుటద్దంగా నిలుస్తున్నామని అన్నారు. భవిష్యత్‌లోనూ మరింత బాధ్యతగా పనిచేస్తామని.. అక్షరాన్ని ఆయుధంగా మలచి సమస్యల పరిష్కారం కోసం నిజాయితీగా, నిబద్ధతగా ముందుకుసాగుతామని అన్నారు. ఈ సందర్భంగా పాఠకులకు, ప్రకటనకర్తలకు ప్రత్యేకంగా కృతజ్క్షతలు తెలిపారు.
ప్రజాపక్షంగా.. ప్రతిపక్షంగా ఉంటాం : ఎడిటర్, అరెల్లి కిరణ్ గౌడ్
సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ, విశ్వసనీయ సమాచారాన్ని ప్రజలకు అందించాలనే సంకల్పంతో ప్రారంభమైన ఉత్తరం కాకతీయ దినపత్రిక జర్నలిజంలో నూతన ఒరవడిని చూపుతోంది. ప్రభుత్వానికి ప్రతిపక్షంగా.. ప్రజాపక్షంగా వ్యవహరించడమే మా లక్షణం. జర్నలిజం విలువలకు కట్టుబడి..ఖచ్చితత్వం, విశ్వసనీయతతో కూడిన వార్తలను ఎప్పటికప్పుడు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూనే ప్రజాపక్షంగా ఉంటాం. కేవలం ఐదునెలల కాలంలోనే పాఠకుల ఆదరాభిమానాలను సాధించడం వెనుక టీం వర్క్ ఉంది. ఉత్తరం కాకతీయ సామాన్యుల గొంతుకవుతోంది. పీడిత ప్రజల బాధను వినిపించేందుకు వేదికనిస్తోంది. ఇది ఆరంభమే.. మున్ముందు మరింత విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నాం. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రజల సమస్యలను నిరంతరం వెలుగులోకి తీసుకురావడమే మా లక్ష్యం. అభివృద్ధి పనుల పురోగతి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యలపై, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై సమగ్ర కథనాలతో పాఠకుల కళ్లకు కడుతాం.
కార్యక్రమంలో స్టేట్ బ్యూరో చీఫ్ సర్వేశ్వర్, వరంగల్ బ్యూరో సందీప్, వరంగల్ సిటీ ఆర్సీ ఇన్చార్జి చిప్ప సుధాకర్, వరంగల్ సిటీ రిపోర్టర్ అడుప అశోక్, ఆత్మకూరు రిపోర్టర్ సంపత్,


